4, నవంబర్ 2008, మంగళవారం

తెలు"గోడు"

చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడా, గతమెంతో ఘనకీర్తి గలవోడా.....

అంటే ఇప్పుడు ఘనకీర్తి లేదా? ఉందో లేదో నిర్ణయించుకోవలసింది మనమే! ఏమంటారు? సరే అసలింతకి సంగతేంటంటే ఈ తెలుగు బ్లాగోగులలో నేను కూడా వో గోడు వెలగబెడదామని "తోటరాముడి లెక్క డిసైడ్ జేసిన" కాకపొతే సరదాగా హాస్యం రాయాలా? లేక సీరియస్ గా విధివిలాస్యం రాయాలా? (ప్రాసకోసం అలా పదప్రయోగాలవీ చెస్తూ వుంటా తెలుగు పండితులూ, క్షమించేసెయ్యండి) అని అర్ధం కాక బుర్ర గోక్కుంటున్నా. రెండూ కలిపి రాయడానికి నేనేమన్నా ఈకాలం లొ జాడ లేని గురజాడనా?

యేదో ఒకటి వచ్చింది రాసేయ్ మామా ఆనక చదివేవాడి ఖర్మ అని మా అశోక్ గాడన్నాడు. అలాగేనని రాయడానికి మొదలు పెట్టానా, అప్పుడే తెలిసింది ఈ తెలుగులో బ్లాగులు గట్రా రాయడం "అదంత వీజీ కాదని!"
మొదటిదే కదా, ఈసారికి మెల్లిగా రాద్దాం లే ఓపికగా అనుకునేలోపల మళ్ళీ మా అశోక్ గాడు "అరేయ్! లేక లేక మూడొచ్చింది ఇప్పుడు రాసేస్తావా లేదా" అని బెదిరించాడు. తప్పలేదు. ఏమాటకామాటే చెప్పుకోవాలి, పేజీలకు పేజీలు రాస్తున్న సాటి తెలుగు బ్లాగర్లూ మీకు జోహార్. ఇంగ్లీషు నుంచి తెలుగులో టైప్ చేసి రాయడం
..... "అదంత వీజీ కాదు!"

3 కామెంట్‌లు:

  1. బ్లాగు లోకానికి స్వాగతం.
    "తెలుగులో టైప్ చేసి రాయడం."అదంత వీజీ కాదు!"
    మీరు మాత్రం చాలా easeతో, చక్కగా రాస్తున్నారు, ఇలానే కొనసాగించండి.

    తెలు-గోడు పేరుతో ఇంకొక బ్లాగు ఉంది చూసారా? http://anilroyal.wordpress.com/

    ఓ చిన్న సూచన, వ్యాఖ్యలకి వర్డు వెరిఫికేషన్ తీసివేస్తే బాగుంటుంది, వ్యాఖ్యానించటానికి తేలికగా ఉంటుంది.

    రిప్లయితొలగించండి
  2. సలహాలకు, సహకారానికి చాలా థాంక్స్ .కృతఙ్యుడిని.

    రిప్లయితొలగించండి